తన భార్య ఆర్తి నుంచి విడిపోతున్నానని ఇటీవల నటుడు జయంరవి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చెన్నై ఫ్యామిలీ కోర్టు తాజాగా ఈ పిటిషన్‌ను పరిశీలించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని, రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని సూచించింది. విడిపోవాలనుకుంటే.. అందుకు కారణాన్ని స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa