ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో ధనుష్ పై విరుచుకుపడ్డ నయనతార

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 16, 2024, 02:10 PM

కోలీవుడ్ హీరో ధనుష్ పై లేడీ సూపర్ స్టార్ నయనతార తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఇన్ స్టాలో బహిరంగ లేఖ పోస్ట్ చేసింది. తన రాబోయే డాక్యుమెంటరీ, నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్‌లో..తన నానుమ్ రౌడీ సీన్స్, పాటలు ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె విరుచుకుపడింది. అసలేం జరిగిందంటే.. నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ 2022లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీగా విడుదల చేయనున్నారు. అనేక అడ్డంకులు, సవాళ్లను దాటి ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీ ఆలస్యం కావడానికి హీరో ధనుష్ కారణమని చెబుతూ తీవ్ర స్థాయిలో అతడిపై విమర్శలు చేసింది. అభిమానులకు కనిపించే ధనుష్ వేరు అని.. నిజానికి అసలైన ధనుష్ వేరని.. ఫ్యాన్స్ కు సూక్తులు చెప్పే నువ్వు పాటించవంటూ ఏ రేంజ్ లో విరుచుకుపడింది. ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేస్తూ అందులో ధనుష్ గురించి అనేక విషయాలను బయటపెట్టింది.


 


'సినీరంగంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఒంటరి మహిళగా సవాళ్లతో కూడిన చిత్ర పరిశ్రమకు వచ్చి కష్టపడి, చిత్తశుద్ధితో ఈ స్థాయికి చేరుకున్నాను. నన్ను ప్రేమించే నా అభిమానులకు, సినీ పరిశ్రమకు నా ప్రయాణం గురించి బాగా తెలుసు. నాపై చాలా సంవత్సరాలుగా జరుగుతున్న కొన్ని తప్పుడు చర్యలను నేను ఇప్పుడు ధైర్యంగా బయటపెట్టాలనుకుంటున్నాను. తండ్రి శ్రీ. కస్తూరి రాజా సపోర్ట్ తో గ్రేట్ డైరెక్టర్ బ్రదర్ Mr. కె. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సినీ పరిశ్రమకు వచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నానుడ. కానీ మీరు మీ ఈ చిల్లర పనులను అర్థం చేసుకుని సరిదిద్దుకోండి. నాలాగే, నా అభిమానులు, శ్రేయోభిలాషులు చాలా మంది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' కోసం ఎదురుచూస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కోసం ఎన్నో అడ్డంకులను అధిగమించి అన్ని పనులు పూర్తి చేసి ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యాము. కానీ ఇప్పుడు మీ రివెంజ్ ప్రవర్తన నా భర్తను మాత్రమే కాకుండా డాక్యుమెంటరీ పనికి పనిచేసిన ప్రతి ఒక్కరిపై పడింది. ప్రేమ, పెళ్లితో సహా నా జీవితంలోని ఆనంద ఘట్టాలు ఉన్న ఈ డాక్యుమెంటరీలో తీపి జ్ఞాపకాలను తీసుకెళ్లడానికి పలు ల్లోని సీన్లను ఉపయోగించేందుకు చాలా మంది వెంటనే అంగీకరించారు. కానీ నానుమ్ రౌడీతాన్ రాలేదని బాధగా ఉంది. నేను నా జీవితంలో పొందిన ప్రేమకు ఆ సీన్స్ ఉపయోగించలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో రాబోయే డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్'లో 'నానుమ్ రౌడితాన్' నుండి ఫుటేజ్, పాటలు, ఫోటోలను ఉపయోగించడానికి మీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) లేటర్ రాకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 2 ఏళ్లు వేచి చూసినా ఫలితం లేకుండా పోయి ఇప్పుడు విడుదలవుతున్న డాక్యుమెంటరీని రీ షూట్ చేసి, ఎడిట్ చేసి రూపొందించాం. 'నానుమ్ రౌడీతాన్' పాటలు నేటికీ అభిమానులు ఇష్టపడటానికి కారణం.. అందులో అద్భుతమైన సాహిత్యం. ఆ పాటలలోని కొన్ని లైన్లను మేము డాక్యుమెంటరీలో ఉపయోగించకపోవటం ఎంత కలత కలిగిస్తుందో మీకు తప్ప అందరికీ అర్థమవుతుంది. ఇది కేవలం బిజినెస్ పరమైన.. లేదా చట్టబద్ధమైనదైతే నేను NOC నిరాకరణను ఖచ్చితంగా అంగీకరించి ఉండేవాడిని. కానీ ఇది పూర్తిగా నా పట్ల ఉన్న మీ వ్యకిగత ద్వేషంతో చేసిన పనిని ఎలా ఒప్పుకోగలరు.. ?


ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఉపయోగించిన 3 సెకన్ల వీడియోపై లీగల్ నోటీసు పంపడం చూసి షాకయ్యాను. అంతేకాదు.. ప్రైవేట్‌గా తీసిన సీన్‌కి, ఇప్పటికే వెబ్‌సైట్లలో షేర్ చేసినందుకు ₹10,00,00,000 (పది కోట్లు) పరిహారం కోరడం చాలా విచిత్రం. ఈ వినయపూర్వకమైన చర్య మీరు ఎలాంటి వ్యక్తి అనేది తెలియజేస్తుంది. మీరు స్టేజ్ పై మాట్లాడే మాటలను మీరు ఒక్కసారి కూడా పాటించరని నాకు, నా భర్తకు తెలుసు. ఒక నిర్మాత తన ల్లో పనిచేసే ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితాన్ని, స్వేచ్ఛను నియంత్రించగలడా? చట్టపరమైన చర్యలను చట్టపరంగా ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. 'నానుమ్ రౌడీతాన్' చిత్రానికి సంబంధించిన సన్నివేశాలు పాటలకు కాపీరైట్ నో హోల్డ్ బ్యార్డ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను దయచేసి కోర్టుకు వివరించండి. ' అంటూ సుధీర్ఘ లేఖ విడుదల చేసింది నయన్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com