ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెట్టింట్లో తనయుడుతో సంద‌డి చేసిన నాని!

cinema |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2019, 08:39 PM

గ్యాంగ్ లీడర్ గా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోతున్నాడు నేచురల్ స్టార్ నానీ. ఈ మధ్యే విడుదలైన జెర్సీ సినిమా సూపర్ హిట్ అవడంతో అదే ఉత్సాహంతో మరో బంపర్ హిట్ ఇవ్వడానికి దూసుకు వస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు గ్యాంగ్ లీడర్ చిత్రబృందం. ఇదిలా ఉంటే, ఇటీవల సినిమాలతోనే కాకుండా తన ముద్దుల తనయుడు అర్జున్ తో కలసి అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నాడు. ఇంట్లో బెడ్‌ కింద దాక్కునేందుకు యత్నించిన అర్జున్‌ను.. నాని స్టైలిష్‌గా తన భూజలపైకి ఎత్తుకుని ఆడిస్తున్నట్టున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను నాని భార్య అంజన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు.. 'సో క్యూట్‌' అంటూ కామెంట్లు పెడుతున్నారు. తన వారసుడితో నానీ చేస్తున్న సందడి ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.


 


https://www.hmtvlive.com/movies/natural-star-nani-with-his-son-arjun-24564






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa