ఓటీటీలోకి ఇవాళ (నవంబర్ 21) ఒక్కరోజే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వాటిలో నాలుగు మాత్రం తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి.అది కూడా ఒక్కోటి ఒక్కో జోనర్లో. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
ఏలియన్ రోములస్ ఓటీటీ
హారర్ అండ్ సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కిన ఇంగ్లీష్ మూవీ ఏలియనన్ రోములస్. ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 350.9 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్ అందుకున్న ఏలియన్ రోములస్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నేటి నుంచి అంటే నవంబర్ 21 నుంచి ఏలియన్ రోములస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్లో హారర్ ఎలిమెంట్స్ ఇష్టపడేవాళ్లు దీనిపై లుక్కేయొచ్చు.
బఘీర ఓటీటీ
కన్నడ పాపులర్ హీరో, రోరింగ్ స్టార్ శ్రీమురళి నటించిన సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ చిత్రం బఘీర. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన బఘీర ఓటీటీలోకి వచ్చేసింది. 7.9 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉన్న బఘీర నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, కన్నడ భాషల్లో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. త్వరలో తమిళం, మలయాళ భాషల్లో కూడా బఘీర ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
ఐ హేట్ లవ్ ఓటీటీ
తెలుగులో తెరకెక్కిన లో బడ్జెట్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ఐ హేట్ లవ్. నేనూ ప్రేమలో పడ్డాను అనేది సినిమా ట్యాగ్‌లైన్. రూరల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఐ హేట్ లవ్ ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదలైంది. తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి ఐ హేట్ లవ్ ఈటీవీ విన్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఏ మ్యాన్ ఆన్ ది ఇన్సైడ్ ఓటీటీ
ఇంగ్లీష్‌లో తెరకెక్కిన డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ కామెడీ వెబ్ సిరీస్ ఏ మ్యాన్ ఆన్ ది ఇన్సైడ్. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్‌ను సాన్ ఫ్రాన్సిస్కోలో అండర్ కవర్ ఆపరేషన్ కోసం నియమిస్తారు. ఆ తర్వాత జరిగే సన్నివేశాల సమూహారమే ఈ వెబ్ సిరీస్ కథ. ఇవాళ్టీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఏ మ్యాన్ ఆన్ ది ఇన్సైడ్ కథ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా ఇంగ్లీష్‌తోపాటు హిందీ, తెలుగు భాషల్లో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
ఈ వారం ఓటీటీ తెలుగు సినిమాలు
ఇవే కాకుండా ఈ వారం ఓటీటీలోకి తెలుగులో మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కు వచ్చాయి. మలయాళంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ చిత్రం కిష్కింద కాండం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్యూన్: ప్రొపెసీ వెబ్ సిరీస్ జియో సినిమా ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉంది.
మరో రెండు
వీటితోపాటు నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నవంబర్ 19 నుంచి ప్రసారం అవుతోంది. అలాగే, ధ్రువ సర్జా నటించిన డిజాస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మార్టిన్ మూవీ ఆహా, అమెజాన్ ప్రైమ్ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.