క్వీన్ ఆఫ్ ది బాక్సాఫీస్ సాయి పల్లవి.. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకు ముందు డాన్సర్ గా మంచి పేరు దక్కించుకుంది.ప్రముఖ ఛానల్లో ప్రసారమైన ఢీ జూనియర్ లో టైటిల్ విన్నర్ గా నిలిచి తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వైద్య విద్యని అభ్యసించిన ఈమె, సినిమా రంగంలోకి రావాలనుకునే తన కలను నెరవేర్చుకుంది.ఈ క్రమంలో మలయాళం లో వచ్చిన ప్రేమమ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే అక్కడి ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న సాయి పల్లవి, ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది.మొదటి సినిమాతోనే తన అందంతో, నటనతో ప్రత్యేకంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు సాయి పల్లవి నటించిన ప్రతి సినిమా కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉండి, డాన్స్ పెర్ఫార్మన్స్ కచ్చితంగా ఉంటేనే చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు ఈమె చేసిన ప్రతి సినిమాలో కూడా ఈమె డాన్స్ పెర్ఫార్మన్స్ కచ్చితంగా ఉండి తీరాల్సిందే.ఇదిలా ఉండగా సాయి పల్లవిలో ఉన్న సరికొత్త టాలెంట్ చూసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. ఈమెలో మంచి గాయకులు ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సాయి పల్లవి. ఆ ఇంటర్వ్యూలో యాంకర్.. మీకు ఏ పాటంటే ఇష్టం.. దేవుడి కోసం ఏ పాట పాడుతారు అని ప్రశ్నించగా.. తన అద్భుతమైన గొంతుతో పాట పాడి అందరినీ అబ్బురపరిచింది.సాయి పల్లవి పాటను విని శ్రోతలు మైమరచిపోతున్నారు. అంతేకాదు సాయి పల్లవిలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం