నాగచైతన్య పుట్టినరోజున కొత్త సినిమాని ప్రకటించాడు. ప్రస్తుతం 'తండేల్' చేస్తున్న ఈ అక్కినేని హీరో.. ఇప్పుడు 'విరూపాక్ష' దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.మిథికల్ థ్రిల్లర్ అంటే.. మైథలాజికల్ ప్లస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ ఇది. తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు.నాగచైతన్య హీరోగా నటిస్తుండగా.. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ అనుకుంటున్నారని తెలుస్తోంది. డిసెంబర్ నుంచే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఓ కన్ను.. అందులో నాగచైతన్య పర్వతంపై నిలబడ్డ ప్రతిబింబం రావడాన్ని చూపించారు.'కాంతార', 'విరూపాక్ష', 'మంగళవారం' చిత్రాలతో పాటు 'పుష్ప 2'కి కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్న అజనీష్ లోక్‌నాథ్ ఈ థ్రిల్లర్‌కు సంగీతం అందించబోతున్నాడు. హీరోయిన్లుగా మీనాక్షిని ఎంచుకున్నారు. కానీ ఆ డీటైల్స్ త్వరలో బయటపెడతారు. అలానే మిగతా విషయాలు కూడా త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.