cinema | Suryaa Desk | Published :
Sun, Nov 24, 2024, 01:10 PM
సీనియర్ నటి సీత ఇంట్లో చోరీ జరిగింది. తన బంగారు ఆభరణం ఎవరో దొంగిలించారని ఆమె విరుగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెండున్నర సవర్ల నగ ఒకటి కనిపించకపోవడంతో ఎవరో తెలిసిన వారే అపహరించి ఉంటారని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నటి సీత ఇంట్లో జరిగిన ఈ చోరీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com