విజయ్ దేవరకొండ, రష్మిక ఔటింగ్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. ఓ రెస్టారెంట్ లో వారు తింటుండగా తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్, రష్మిక డేటింగ్ లో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను వారు ఖండిస్తూ వచ్చారు. కానీ ఇటీవలే విజయ్ ఓ ఇంటర్వ్యూలో నేను సింగిల్ గా లేను అని చెప్పిన విషయం తెలిసిందే. దీనికి తోడు ప్రస్తుతం ఈ ఫోటో బయటకు రావడంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో ఉందని నెటిజన్లు భావిస్తున్నారు.దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏదో ఉందని భావించారు. గతంలో ఓ సారి వీరిద్దరూ జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఇటీవల రష్మిక విజయ్ ఇంట్లో దీపావళి సెలబ్రేట్ చేసుకొని ఫోటోలు షేర్ చేసి, ఫోటోలు తీసింది ఆనంద్ దేవరకొండ అని కూడా చెప్పింది. దీంతో మళ్ళీ విజయ్ – రష్మిక ల మధ్య ఏదో ఉందని వార్తలు వైరల్ అయ్యాయి.