హీరోల మధ్య ఎలాంటి విభేదాలు లేకపోయినా ఫ్యాన్ వార్స్ మాత్రం బాగా జరుగుతుంటాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ చాలా మంది ఫ్యాన్స్ కొట్టుకు చేస్తుంటారు.మేము మేము బాగానే ఉంటాం మీరు ఎందుకు ఫ్యాన్ వార్స్ చేస్తుంటారు అని హీరోలు చెప్పినా కూడా కొంతమంది ఆగారు. కేవలం టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోనూ ఫ్యాన్ వార్స్ ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. తాజాగా ఓ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పచ్చి గడ్డివేస్తే భగ్గుమంటుంది. కానీ ఆ హీరోలు మాత్రం ఇదిగో ఇలా కలిసి కనిపించారు. ఆ హీరోలే ధనుష్, శింబు.నిర్మాత-దర్శకుడు ఆకాష్ వివాహ రిసెప్షన్‌లో నటుడు ధనుష్ , శింబు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. నటుడు ధనుష్ ప్రస్తుతం 'ఇట్లీ కాద్' చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత ఆకాష్, తరణీశ్వరి వివాహం గత గురువారం చెన్నైలో జరిగింది. అంతకు ముందు ధనుష్, నయనతార ఈ వివాహానికి హాజరైన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. తాజాగా శింబు, ధనుష్ చాలా కాలం తర్వాత ఆకాష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో కలుసుకున్నారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి.
తమిళ చిత్రసీమలో నటీనటుల మధ్య పోటీ అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. హీరోల మధ్య పోటీ ఉన్నా.. లేకున్నా.. వారి అభిమానుల మధ్య పోటీ ఎక్కువైంది. కోలీవుడ్ లో ఎంజీఆర్-శివాజీ కాలం నుంచి రజనీ-కమల్, అజిత్-విజయ్, శింబు-ధనుష్‌ల మధ్య ఫ్యాన్ వార్ లు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ధనుష్, శింబు ఒకరినొకరు హగ్ చేసుకొని ఆప్యాయంగా పలకరించుకోవడంతో ఇద్దరి అభిమానులు తెగ సంబరపడుతున్నారు. శింబు, ధనుష్ ఇద్దరూ తమ లతో బిజీగా ఉన్నారు.