ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కనక దుర్గ అమ్మవారిని సందర్శించుకున్న విశ్వేక్ సేన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 25, 2024, 05:53 PM

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో నటించిన 'మెకానిక్ రాకీ' చిత్రం నవంబర్ 22, 2024న భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ సినిమాని దేశవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ సినిమా విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి సానుకూల సమీక్షలను పొందింది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి జోడిగా నటిస్తుంది. తాజాగా నటుడు విశ్వేక్ సేన్ విజయవాడలోని కనక దుర్గ అమ్మవారిని సందర్శించుకున్నారు. ఈ విషయాన్ని తెలియాజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్  కీలక పాత్రలో నటించారు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ మరియు రోడీస్ రఘు రామ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.  ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌పై రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa