నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న 'అన్ స్టాపబుల్' ఆడియెన్స్ కు మస్త్ ఎంటర్ టైన్మెంట్ అందిస్తోంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఇప్పటికే ఈ టాక్ షోకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు.తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి చాలా మందికి తెలియని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇక అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నాలుగో ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్స్ కు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ కు అయితే రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీంతో అన్ స్టాపబుల్ సీజన్ 4 ఐదో ఎపిసోడ్ కు ఎవరు గెస్ట్ లుగా రానున్నారోనని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. డ్యాన్సింగ్ క్వీన్, కిస్సిక్ బ్యూటీ శ్రీలీల బాలయ్య టాక్ షో లో సందడి చేయనుంది. అలాగే జాతి రత్నం నవీన్ పొలిశెట్టి కూడా ఈ టాక్ షోకు హాజరవుతున్నాడు.
అన్ స్టాపబుల్ సీజన్ 4 ఐదో ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కోసం శ్రీలీల ఆహా స్టూడియోకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. స్లీవ్ లెస్ టాప్, చీరకట్టులో క్యారవాన్ ముందు హొయలు పోతున్న స్టిల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే శ్రీలీల ఎపిసోడ్ ప్రోమో ఎప్పుడొస్తుందనేది తెలియాల్సి ఉంది.