ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT ట్రేండింగ్ లో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 28, 2024, 05:27 PM

టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ, రుక్మిణి వసంత్ నటించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చిత్రం ప్రేక్షకుల నుండి మిరిశ్రమ స్పందనను అందుకుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఇండియా వైడ్ గా డిజిటల్ ప్లాట్ఫారం లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు, సత్య, అజయ్ మరియు జాన్ విజయ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. అజయ్ మరియు తమిళ నటుడు జాన్ విజయ్ విలన్‌లుగా ఉన్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందించగా, సన్నీ ఎంఆర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa