కార్తిక్ ఆర్యన్, ట్రిప్తి డిమ్రీ, విద్యాబాలన్ మరియు మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలలో నటించిన భూల్ భూలయ్యా 3 నవంబర్ 1, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదైనా అన్ని చోట్ల సాలిడ్ రెస్పాన్స్ ని అందుకొని బాక్స్ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ట్రిప్తి డిమ్రీ కార్తీక్ ప్రేమ పాత్రలో నటిస్తుండగా, సహాయక తారాగణంలో విజయ్ రాజ్, సంజయ్ మిశ్రా మరియు అశ్విని కల్సేకర్ ఉన్నారు. ఈ సినిమాకి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా డిసెంబర్ 27న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. 2007లో అక్షయ్ కుమార్‌తో ప్రారంభమైన భూల్ భూలయ్యా ఫ్రాంచైజీ చాలా ముందుకు వచ్చింది. 2022లో విడుదలైన రెండవ భాగం కార్తీక్ ఆర్యన్‌ని రూహ్ బాబాగా పరిచయం చేసింది. ఈ చిత్రంలో ట్రిప్తి డిమ్రీ కార్తిక్ ఆర్యన్ కి జోడిగా నటిస్తుంది మరియు ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ కీలక పాత్రలో నటించారు. టి-సిరీస్ ఈ బిగ్గీని బ్యాంక్రోల్ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa