ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ వన్ మాన్ షో పుష్ప 2 ఈ నెల ఐదున వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.పైగా ఈ రోజు నైట్ నుంచి ప్రీమియర్ షోస్ తో పాటు బెనిఫిట్ షోస్ కూడా పడనున్నాయి.దీంతో అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా సినిమా రిజల్ట్ పట్ల ఎంతో క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఇక పుష్ప 2 గురించి ఇంతవరకు మెగా కాంపౌండ్ మాట్లాడటం గాని, ట్వీట్ కానీ చెయ్యలేదు.ఈ నేపథ్యంలో మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవాలంటూ బన్నీ,సుకుమార్ లతో పాటు టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.గత కొన్ని రోజులుగా మెగా అండ్ అల్లు అభిమానుల మధ్య వార్ జరుగుతున్న దృష్ట్యా ఇప్పుడు ఈ ట్వీట్ సినీ సర్కిల్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా వైరల్ గా మారింది.