టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' భారీ అంచనాల మధ్య ఈరోజు పెద్ద స్క్రీన్‌లను తాకింది. ఈ చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 150 కోట్లు పైగా నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ తెలుగు వెర్షన్ తో కలెక్షన్ల పరంగా పోటీ పడుతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్‌లో రెండు భారీ రికార్డులను నమోదు చేసింది. ఈ చిత్రం షారుఖ్ ఖాన్ జవాన్ డే వన్ రికార్డును (65.5 కోట్ల గ్రాస్) అధిగమించి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని జవాన్‌ను సెలవు రోజున విడుదల చేశారు. పుష్ప 2 యానిమల్‌ను 54.75 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేయడం ద్వారా ఆల్ టైమ్ అత్యధిక నాన్-హాలిడే ఓపెనింగ్‌ను స్కోర్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడున్న జోరు చూస్తుంటే యానిమల్ క్రాస్ చేయడం పుష్ప 2కి కేక్ వాక్ అవుతుందేమో మరి జవాన్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేస్తుందేమో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa