కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ -విజయ్ సేతుపతి వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ విడుదల పార్ట్ 2 . సూరి మరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సీక్వెల్‌లో మంజు వారియర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.ప్రాంతం, జాతి, భాష అని జనాల్ని ఒకటిగా చేసే పని నేను మొదలుపెట్టినప్పుడు ఏర్పాటు చేసిన ఈ కులం, మతం, వేర్పాటు వాదం దేనితోను మీరు రాజకీయం చేయలేకపోయారు. అప్పుడు మొదలైందీ భయం అంటూ షురూ అయిన ట్రైలర్ హింస మా భాష కాదు.. కానీ ఆ భాష కూడా మాకు మాట్లాడం వచ్చనే డైలాగ్స్ వెనుక బడిన ప్రజల కోసం పోరాడే పెరుమాళ్ స్టోరీ నేపథ్యంలో సినిమా సీరియస్ ట్రాక్‌తో ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేసింది.
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ ప్రాంఛైజీలో విజయ్ సేతుపతి గిరిజనులకు అండగా నిలిచే పెరుమాళ్ వాథియార్ పాత్రలో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. మక్కల్ సెల్వన్‌కు జోడీగా మంజువారియర్ నటిస్తోంది. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.