పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ మూవీ రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.829 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేస్తూ నాలుగు రోజుల గ్రాస్ కలెక్షన్స్ అనౌన్స్ చేశారు.అయితే, తెలుగు కంటే హిందీలోనే పుష్ప 2కు ఎక్కువ కలెక్షన్స్ వస్తోన్నాయి.హిందీ సినిమాల హిస్టరీలో రూ.291 కోట్ల నికర వసూళ్లు (నెట్ కలెక్షన్స్) సాధించింది. బాలీవుడ్ సినిమాల కలెక్షన్ల ఆల్ టైమ్ రికార్డ్‌ను పుష్ప 2 తిరగరాసింది. అంతేకాదు నాలుగోవ రోజైన ఆదివారం (DEC 8న) హిందీ వెర్షన్ రూ.86 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ, తెలుగులో మాత్రం ఆదివారం రూ.44 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.అలాగే వరల్డ్ వైడ్గా కేవలం 4 రోజుల్లోనే అత్యంత వేగంగా రూ.829 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. 'వైల్డ్‌ఫైర్ బ్లాక్‌బస్టర్.. సినిమాల్లో రూలింగ్' అంటూ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. ఇకపోతే కేరళలో మాత్రం పుష్ప 2 ఆశించిన స్థాయిలో వసూళ్లను దక్కించుకోలేకపోతుంది. అక్కడ అల్లు అర్జున్ కి స్పెషల్ స్టేటస్ ఫ్యాన్స్ ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా బన్నీని 'మల్లు అర్జున్' అంటూ పిలుస్తూ ప్రేమ చూపిస్తున్నారు..కానీ, కేరళలో వసూళ్లు సాధించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.