తెలుగు టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్ నటించిన 'జీబ్రా' నవంబర్ 22న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ ప్రధాన పాత్రలో ఒకరు. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ మల్టీ స్టారర్‌కి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు మిశ్రమ సమీక్షలు వచ్చాయి. ఇది ఇప్పుడు ఈ వారం ఆహాలో OTT అరంగేట్రం చేయటానికి సిద్ధంగా ఉంది. జీబ్రా డిసెంబర్ 13, 2024 నుండి తెలుగు మరియు తమిళం రెండింటిలోనూ ప్రసారానికి అందుబాటులో ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇతర భాషల్లోని వెర్షన్లతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అధికారిక ప్రకటన రావలిసిఉంది. ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రియా భవానీ శంకర్ మరియు జెన్నిఫర్ పిక్కినాటో మహిళా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు సత్యరాజ్, సత్య ఆకల, సునీల్, ప్రియా భవాని శంకర్ ఇతరలు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సాంకేతిక బృందంలో రవి బస్రూర్ సంగీతం, సత్య పొన్మార్ సినిమాటోగ్రాఫర్ మరియు అనిల్ క్రిష్ ఎడిటర్‌గా ఉన్నారు. మీరాఖ్ డైలాగ్స్ రాయగా, సుబ్బు స్టంట్స్ చూసుకోగా, అశ్విని ముల్పూరి, గంగాధర్ బొమ్మరాజు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు.