ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ కల్కి 2898 ADని అందించిన తర్వాత ప్రశంసలు పొందిన టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ మరోసారి ముఖ్యాంశాలు చేస్తున్నాడు. కల్కి సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా సోషల్ మీడియాలో కొత్త సందడి నెలకొంది. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో నాగ్ అశ్విన్ ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో తన తొలి సినిమాని ఇప్పటికే ప్రకటించిన మోక్షజ్ఞ, తన రెండవ చిత్రం కోసం నాగ్ అశ్విన్‌తో జతకట్టవచ్చు అని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైన వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. నిజమైతే ఈ సహకారం నందమూరి అభిమానులను మరియు సినీ ప్రేక్షకులను ఉత్సాహపరిచేలా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.