కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లో స్టార్ గా మారిన ముద్దుగుమ్మల్లో శ్రీలీల ఒకరు. చిన్నవయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కన్నడలో పలు లు చేసింది.ఆతర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. తెలుగులో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్ళిసందడి అనే ద్వారా పరిచయం అయింది. తొలి తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ వయ్యారి భామ. ఆతర్వాత మాస్ మహారాజ రవితేజ సరసన చేసింది. ధమాకా భారీ విజయం అందుకోవడంతో శ్రీలీల పేరు మరు మ్రోగిపోయింది. అంతే గ్యాప్ లేకుండా వరుసగా లు చేసింది ఈ క్యూటీ. బ్యాక్ టు బ్యాక్ లు చేసింది కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది శ్రీలీల. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు అందరితో జతకట్టింది.. కానీ సాలిడ్ హిట్ మాత్రం పడలేదు.
సక్సెస్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్న శ్రీలీల ఇప్పుడు ట్రాక్ మార్చింది. ఈ మధ్య గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. హీరోయిన్ గా లు చేస్తూనే ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. తాజాగా పుష్ప 2లో కిస్సాక్ అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. శ్రీలీల క్రేజ్ డబుల్ అయ్యింది. ఇప్పుడు ఈ అమ్మడి బాటలోనే మరో హీరోయిన్ కూడా నడుస్తుంది. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కేతిక శర్మ.
ఈ బబ్లీ గర్ల్ రొమాంటిక్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తన అందంతో ఆడియన్స్ ను కళ్ళు తిప్పుకోకుండా చేసింది ఈ హాటీ. ఆతర్వాత వరుసగా ఛాన్స్ లు అందుకుంది. మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లతో లు చేసిన సాలిడ్ సక్సెస్ మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. దాంతో లకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తుంది. ఇక ఇప్పుడు శ్రీలీలలానే స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది కేతిక. యంగ్ హీరో నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ లో కేతిక స్పెషల్ సాంగ్ చేయనుంది. ఇటీవలే ఈ అమ్మడి పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరి ఈ స్పెషల్ సాంగ్ తర్వాత కేతిక క్రేజ్ పెరుగుతుందేమో చూడాలి.