జాతీయ అవార్డు గ్రహీత నటుడు ధనుష్ ఇటీవల దర్శకత్వం వహించిన రాయన్ బాక్స్ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ధనుష్ మూడవ దర్శకత్వం వహించిన నీక్ (నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్) చిత్రంలో అనికా సురేంద్రన్, పవిష్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్ మరియు రమ్య రంగనాథన్ ప్రధాన పాత్రలు పోషించారు. నటి ప్రియాంక మోహన్ నటించిన మొదటి సింగిల్ గోల్డెన్ స్పార ఇప్పుడు యూట్యూబ్‌లో 50 మిలియన్లకు పైగా వీక్షణలతో సెన్సేషన్ సృష్టిస్తుంది. ఈ యూత్ ఫుల్ డ్రామాకి ఈ పాట మంచి హైప్ తీసుకొచ్చింది. తాజాగా మూవీ మేకర్స్ నీలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్ (నీక్) ఫిబ్రవరి 7, 2025న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాని తమిళనాడులో రెడ్ జైన్ట్ మూవీస్ బ్యానర్ విడుదల చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, అనికా సురేంద్రన్, మాథ్యూ థామస్, పవిష్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్ మరియు రమ్య రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ధనుష్ ప్రొడక్షన్ హౌస్ అయిన వండర్‌బార్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.