ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'మిస్ యు'

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 12, 2024, 06:55 PM

నటుడు సిద్ధార్థ్ తన రొమాంటిక్ ఎంటర్టైనర్' మిస్ యు' విడుదలకు సిద్ధమవుతున్నాడు. కళతిల్ సంతతిపోమ్ ఫేమ్ రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆశిఖా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ద్విభాషా ఎంటర్‌టైనర్‌గా తమిళం మరియు తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ రైట్స్ ని ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో జెపి, పొన్వన్నన్, నరేన్, అనుపమ, రామ, బాల శరవణన్, కరుణాకరన్, మారన్, షష్టిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీత దర్శకుడు కాగా, కెజి.వెంకటేష్, దినేష్ పొన్‌రాజ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలను చూసుకుంటున్నారు. 7 మైల్స్ పర్ సెకండ్ బ్యానర్‌పై శామ్యూల్ మాథ్యూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దినేష్ ఎడిటర్ గా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com