సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ డీమోంటే కాలనీ 2 సినిమాలో అరుళ్నితి, ప్రియా భవాని శంకర్ మరియు అర్చన రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సీక్వెల్‌కు ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఇటీవలే టెలికాస్ట్‌లో 2.70 టీఆర్‌పీ రాబట్టింది. శ్రీ బాలాజీ ఫిలిమ్స్ పతాకంపై బి. సురేష్ రెడ్డి మరియు బి. మానస రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ఆంటి జస్కెలైన్, త్సెరింగ్ డోర్జీ మరియు అరుణ్ పాండియన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. జ్ఞానముత్తు పట్టరై మరియు వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి BTG యూనివర్సల్ బ్యానర్‌పై బాబీ బాలచంద్రన్ ఈ సినిమాని నిర్మించారు.