మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా..నరసింహారెడ్డి’.. సురేందర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ షూటింగ్ పూర్తి చేసుకుంది.
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాకు సంబంధించి, తమ కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోలేదని ఆరోపిస్తూ.. ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. అంతేకాదు తమకు ఇస్తానని చెప్పిన గౌరవ పారితోషకం కూడా ఇవ్వలేదని పేర్కొంటున్నారు.
ఈ విషయమై చిరంజీవి, రామ్ చరణ్ ను కలవడానికి ప్రయత్నించినా.. చిత్రయూనిట్ కలవనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై సైరా టీమ్ గానీ, చిరంజీవి, రామ్ చరణ్ ఇంకా స్పందించలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. నయనతార, అనుష్క, తమన్నా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa