తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్‌కు సినీ తారలు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఈ ఘటనపై స్పందించారు. జరిగిన ఘటనకు అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్టును నటి పూనమ్ కౌర్ ఖండించారు. ఆయన సొంతంగా స్టార్ అయిన హీరో అని ట్వీట్ చేశారు.పుష్ప అంటే ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్. ఈ డైలాగ్‌కు తగ్గట్టుగానే మొత్తం దేశం చూపును తనవైపునకు తిప్పుకున్నాడు అల్లు అర్జున్. డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ అంచనాలకు తగ్గట్టుగానే భారీ వసూళ్లు సాధించింది. విడుదలైన అది కొద్దిరోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టి.. పుష్ప అంటే తగ్గేదేలే అని ప్రూవ్ చేసింది. ఇవన్నీ సినిమా సృష్టించిన రికార్డ్‌లు. బన్నీని పాన్ ఇండియా స్టార్‌గా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిన మైలురాళ్లు.
కానీ ఈ క్రేజీ మూవీ రిలీజ్ సమయంలో జరిగిన ఓ ఘటన పుష్ప ఫైర్ మిస్ ఫైర్ అయ్యేలా చేసింది.హైదరాబాద్ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య ధియేటర్ దగ్గర ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఓ మహిళ చనిపోయింది. పదేళ్లలోపున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లు అర్జున్ సంధ్య ధియేటర్‌కు వచ్చిన సమయంలోనే ఈ ఘటన జరగడంతో.. ఆయనపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.