ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పుష్పా-2 మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొకిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ప్రస్తుతం అల్లు అర్జున్‌ను కోర్టులో ప్రవేశ పెట్టేందుకు పోలీసుల రెడీ అవుతున్నారు.ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్ట్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యారు. ఆమె ట్విట్టర్ స్పందిస్తూ...నేను బహిరంగ ర్యాలీలలో చుట్టూ ఉన్న వ్యక్తుల జాబితాను చూడటానికి ప్రయత్నిస్తున్నాను మరియు ఎండలో కాలిపోయి అమాయకులు కూడా తొక్కిసలాటలో చనిపోయారు, అసౌకర్యం మరియు గుండె ఆగిపోవడంతో మరణించిన యువ నటులలో ఒకరు- అల్లు అర్జున్ స్టార్ మేడ్. కృషి వారసత్వం కాదంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అల్లు అర్జున్ సొంతంగా ఎదిగిన నటుడంటూ ఆమె చెప్పుకొచ్చారు.
ఇక ఈ కేసులో నటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ భద్రత నడుమ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తరుఫున లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. అల్లు అర్జున్ తరుఫున లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిరంజన్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిరంజన్ రెడ్డి గతంలో వైసీపీ అధినేత, మాజీ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసును నిరంజన్ రెడ్డినే వాదించారు. ఆయన వైసీపీ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు.