పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు బాలీవుడ్ బ్యూటీలు సైతం పోటీ పడుతుంటారు. అయితే క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రభాస్ కొత్త మూవీ స్పిరిట్ మూవీలో నటించేందుకు ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసింది. అందుకు కారణం ఆ సినిమా దర్శకుడి సందీప్ రెడ్డి వంగా. సందీప్ సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటుందని, అలాగే మహిళలను హీరోలకు బానిసలుగా, తక్కువ చేసి చూపిస్తారనే విమర్శల నేపథ్యంలో నటించనని చెప్పినట్లు సమాచారం.