అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య రీసెంట్ గానే పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సమయంలో తన భారీ చిత్రం “తండేల్” లో కూడా తాను బిజీగా ఉన్నాడు. యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పట్ల మంచి అంచనాలు నెలకొనగా ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి చార్ట్ బస్టర్ అయ్యింది.ఇక ఈ సాంగ్ తర్వాత అంతా శివ శక్తి అనే సాంగ్ కోసం మాట్లాడుకున్నారు. హీరోయిన్ సాయి పల్లవి, హీరో చైతు నడుమ సాగే ఈ సాంగ్ అదిరిపోయింది అని టాక్ ఆ మధ్య వచ్చింది. మరి ఫైనల్ గా ఈ సాంగ్ పై ఇపుడు క్లారిటీ ఇచ్చేసారు మేకర్స్. ఈ డిసెంబర్ 22న మొత్తం మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా సాయి పల్లవి, నాగ చైతన్యపై స్టన్నింగ్ పోస్టర్ తో ఇపుడు రివీల్ చేశారు.మరి మెయిన్ లీడ్ ఇద్దరూ శివ పార్వతుల వలె నాట్య భంగిమలో కనిపిస్తూ ఒకరిని ఒకరు సీరియస్ గా చూసుకుంటున్నట్టుగా కూడా కనిపిస్తుంది. మరి ఇలా 22న తెలుగు, హిందీ మరియు తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే ఈ సాంగ్ ని పవిత్ర కాశీ ఘాట్ వద్ద రిలీజ్ చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ చేశారు. మరి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి