టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటిస్తోన్న మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా ఓజీ . సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది.ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ ఉండబోతుందట.. ఈ పాటలో డీజే టిల్లు భామ నేహాశెట్టి మెస్మరైజ్ చేయబోతుందట. పవన్ కల్యాణ్‌తో నేహాశెట్టి స్టెప్పులేయబోతుందన్న వార్తలపై ప్రస్తుతానికి అధికారిక ప్రకటన ఏం రాకున్నా.. ఈ అప్‌డేట్‌ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూలీ లవర్స్ అండ్ ఫ్యాన్స్.ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. శ్రియారెడ్డి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య తెరకెక్కిస్తున్నారు.