హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మన తెలుగు సినిమా ప్రేక్షకులకి బాలయ్య హీరోగా చేసిన 'లెజెండ్' సినిమాతో ఆమె సుపరిచితురాలు అయ్యింది. ముఖ్యంగా ఆమె నటన విషయంలో బాగా పేరు ప్రఖ్యాతలు గడించింది. ఈ క్రమంలోనే ఎన్నో వైవిధ్యమైన పాత్రలను చేస్తూ ఎన్నో అవార్డులు కూడా కొల్లగొట్టింది. ఇక ఈ అమ్మడు తన బోల్డ్ మాటలతో అప్పుడప్పుడూ వివాదాల్లో కూడా చిక్కుకుంటారు. ఆమధ్య ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి కూడా. ఇక అసలు విషయంలోకి వెళితే... ఆమె రీసెంట్గా తల్లి అయిన సంగతి వినే ఉంటారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ మీడియా వేదికగా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాధిక అనేక విషయాలు పంచుకుంది. ఈ క్రమంలో ఆమె బేబీ బంప్ ఫొటోషూట్ కూడా చేసింది. తన ప్రెగ్నెన్సీ ప్రయాణంలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపింది. రాధిక మాట్లాడుతూ... "పిల్లల విషయంలో మేము ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. అలాగని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. దాంతో ప్రెగ్నెంట్ అయ్యాను. గర్భం దాల్చానని తెలిసిన వెంటనే చాలా కంగారు కలిగింది. డెలివరీకి కొద్ది రోజుల ముందే ఫొటోషూట్‌లో పాల్గొన్నాను. ఆ ఫోటోలు చూసి చాలా షాక్ అయ్యాను. అంత లావుగా నాకు నేను ఎప్పుడూ కనిపించలేదు. ఆ విధంగా నన్ను నేను చూసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను. సరిగ్గా నిద్ర ఉండేది కాదు. తల్లినైన తర్వాత నా శరీరం పూర్తిగా మారిపోయింది." అని చెప్పుకొచ్చారు.కాగా ఆమె చెబుతున్న మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక చివరగా ఆమె మాట్లాడుతూ... ప్రెగ్నెన్సీ సమయంలో తన భర్త బెనెడిక్ట్ తనని అర్థం చేసుకుని ఎంతో సపోర్ట్‌గా నిలిచారని చెప్పుకొచ్చింది. ఇకపోతే మొదట రక్తచరిత్ర అనే డబ్బింగ్ సినిమాతో రాధికా ఆప్టే టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. ఆ తరువాత 2015లో విడుదలైన లెజెండ్ తర్వాత ఆమె టాలీవుడ్‌కు పూర్తిగా దూరం జరిగింది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేసింది. ఈ ఏడాది ఆమె నటించిన మెర్రీ క్రిస్మస్, సిస్టర్ మిడ్‌నైట్ సినిమాలు విడుదల కాగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక ఆమె నటించిన హాలీవుడ్ మూవీ 'లాస్ట్ డేస్' ప్రస్తుతం నిర్మాణాంతర పనులను జరుపుకుంటోంది. 2012లో బ్రిటీష్ కంపోజర్ బెనెడిక్ట్ టేలర్‌ను ఆమె ప్రేమించి పెళ్లాడింది.