బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ముహూర్తం జరిగిన విషయం తెలిసిందే. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా రంగవేప్రశం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ పోస్టర్స్ కూడా రిలీజ్ చేసి క్యూరియాసిటీ పెంచేశాడు. అయితే.. సోషల్ మీడియాలో నెటిజన్లు.. సీన్ రివర్స్ చేస్తూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. 'సినిమా ఆగిపోయిందని.. మోక్షజ్ఞ డెబ్యూ డైరెక్టర్ మారిపోయాడని.. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్తో మోక్షు ఎంట్రీ ఉంటుందని..' ఇలా పలు రకాలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ని అమాంతం కొట్టిపడేశారు. తాజాగా క్లారిటీ ఇస్తూ మేకర్స్ నోట్ రిలీజ్ చేశారు. నిర్మాణ సంస్థ ఎస్ఎల్‌వీ సినిమాస్ క్లారిటీ ఇస్తూ.. "మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ సినిమాపై వస్తోన్న ఊహాగానాల్లో నిజం లేదని.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను రివీల్ చేస్తామని, అసత్యాల్ని నమ్మవద్దని, ప్రచారం చేయద్దని" నోట్ లో వెల్లడించింది.
మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. సరైన సమయంలో ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ వస్తాయి. సమాచారం అభిమానులతో పంచుకుంటాము. అంత వరకు దయచేసి నిరాధార కథనాలు ప్రచారం చేయవద్దు.. అంటూ లేఖలో పేర్కొన్నారు. నిర్మాతల ప్రకటనతో మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ రద్దు కాలేదని క్లారిటీ వచ్చింది.