మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ నుంచి వెళ్లిన ఓ సినిమా హాట్ టాపిక్‌గా నిలిచి చర్చకు దారి తీసింది. ఆ చిత్రమే "పుష్ప 2". దర్శకుడు సుకుమార్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన ఈ సినిమా సంచలన రికార్డులు బద్దలుకొట్టి ఈ ఏడాదిలోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి హిస్టరీ సెట్ చేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన సంగతి తెలిసిందే. పార్ట్ 1లో కూడా అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా స్టన్నింగ్ పెర్ఫామెన్స్ ని చేసి అందరినీ మెస్మరైజ్ చేసింది. పార్ట్ 2లో అయితే అంతకి మించిన డోస్‌ని చూపించిన నేషనల్ క్రష్ ఇపుడు మరోసారి హాట్ టాపిక్ గా నిల్చింది. ముఖ్యంగా పుష్ప 2 జాతర సీక్వెన్స్ తర్వాత అల్లు అర్జున్‌నే డామినేట్ చేస్తూ శ్రీవల్లిగా ఆమె అదరగొట్టేసింది. నటిగా ఇరగదీస్తూనే.. ఇంకోపక్క పీలింగ్స్ అనే సాంగ్ లో ఊహించని హాట్ షో కూడా చేసింది రష్మిక. ఈ సాంగ్ తోనే పాపం విజయ్ దేవరకొండ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా నడిచింది. దీనికి కారణాలు లేకపోలేదు.. గత కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండ - రష్మికలు డేటింగ్‌లో ఉన్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ఇన్ డైరెక్ట్‌గా ఈ ఇద్దరూ చాలా సార్లు తమ ప్రేమపై సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పుష్ప 2లో ఓ కీలక సన్నివేశం కోసం షూట్ సమయంలో రష్మిక మందన్నా... విజయ్ దేవరకొండకి కాల్ చేసి ఏడ్చిందట అంటూ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. పార్ట్ 2లో రష్మికపై కీలక సన్నివేశం విషయంలో తనకి అంత క్లారిటీ లేని సమయంలో విజయ్‌కి కాల్ చేసిందట. దీంతో ఆమెకి విజయ్ మంచి సూచనలు ఇచ్చాడని , ఆ తర్వాత ఆమె చేసిన ఆ సీన్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందట. మరి అంతలా విజయ్ మోటివేట్ చేసే సీన్ ఈ సినిమాలో ఏముందా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే పార్ట్ 1లోనే అల్లు అర్జున్ తో కలిపి ఎన్నో సాలిడ్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. మరి పుష్ప 2లో అలాంటి సీన్స్ పెద్దగా లేవు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజముందో అనేది సస్పెన్స్ గానే ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా సక్సెస్ ని ఇపుడు రష్మికా ఎంజాయ్ చేస్తుండగా ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ్ లోనే దర్శకుడు శేఖర్ కమ్ముల హీరో ధనుష్ తో కుబేర.. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సికందర్ అనే సినిమాలు చేస్తుంది. అలాగే హిందీలో మరిన్ని సినిమా ఆఫర్లు కూడా రష్మికకి వస్తున్నాయని సినీ వర్గాల్లో టాక్.