సోషల్ మీడియాలో ఈ మధ్యకాలం అల్లు వర్సెస్ మెగా వార్ బాగా హీట్ పెంచేసింది . ఫైనల్లీ అల్లు అర్జున్ - మెగాస్టార్చిరంజీవి ఇంటికి వెళ్లడం .. నాగబాబు ఇంటికి వెళ్లడం పర్సనల్గా కలిసి మరి సారీ - థాంక్స్ రెండూ చెప్పడం ఫాన్స్ కూల్ అయిపోయేటట్లు చేసింది. ఆల్మోస్ట్ ఆల్ పరిస్థితి మొత్తం చక్కబడిపోయింది అని అంత అనుకున్నారు . కానీ ఇప్పుడు మళ్ళీ మెగా వెర్సెస్ అల్లు వార్ సోషల్ మీడియాలో హీట్ పెంచేలా చేస్తుంది మెగా ఫ్యామిలీ అంటూ కొన్ని వార్తలు బాగా వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే పుష్ప సినిమా తర్వాత అంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమాగేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్రామ్ చరణ్ హీరోగా కియరా అద్వానీ హీరోయిన్గా అంజలి మరొక హీరోయిన్గా నటించిన సినిమా . జనవరి 10వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని శంకర్ చాలా పక్కాగా ప్లాన్ చేశారు. డిసెంబర్ 21వ తేదీ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా కి సంబంధించిన బృందం మొత్తం అమెరికా చేరుకుంది. అయితే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓకే .. మరి ఇండియాలో చేయరా అంటే చేస్తున్నారు. జనవరి 4వ తేదీ ఇండియాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా చేస్తున్నారు అంటూ తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం రాజమండ్రి లేదా విశాఖపట్నంలోనే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారట . అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . బాబాయ్ కోసం అబ్బాయి ఏదైనా చేస్తాడు. గతంలో రామ్ చరణ్ పిఠాపురంకు వెళ్లి మరి పవన్ కళ్యాణ్ కు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడే పెద్ద తలనొప్పి క్రియేట్ అయింది . పుష్ప 2 సినిమా పెద్ద రాద్ధాంతమే క్రియేట్ చేసింది . అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ అపాయింట్ మెంట్ అడిగిన ఇవ్వలేదట . అంతేకాదు పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గా మీట్ అవ్వాలి అంటూ చూస్తున్న అల్లు అర్జున్ కి అస్సలు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదట. అయితే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా చరణ్ హీరోసినిమాఈవెంట్ గా చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు అంటూ వార్తలు రావడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇది ఒక మైనస్ అయితే ఈవెంట్లో పుష్ప సినిమా గురించి రెస్పాండ్ అవుతాడా ..? అవ్వడా..? అనేది మరొక విషయం . అయితే సోషల్ మీడియాలో మాత్రం బన్నీ ఫ్యాన్స్ కోసం గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తుంది. కొంతమంది ఇంకా ఓ స్టెప్ ముందుకు వేసి "దీన్నే లేపి తన్నించుకోవడం అంటారు.. సైలెంట్ గా నిద్రపోతున్న వాళ్ళని లేపడం ఎందుకు..? ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నా మూమెంట్లో ఇలా గెలకడం ఎందుకు..?" అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!