సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణు గోపాల్ రెడ్డి నిర్మించిన భారీ అంచనాల చిత్రం "లగ్గం" కి రమేష్ చెప్పాల రచించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా OST ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా OST ఇప్పుడు యూట్యూబ్ మరియు ఆదిత్య మ్యూజిక్ లో ప్రసారానికి అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో సాయి రోనక్ మరియు ప్రజ్ఞా నగ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రాచ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రమ్ శీను, సంధ్యా గంధం, టి.సుగుణ, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి, కంచెరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజి బాబు, ఆర్ ఎస్ నంద, కిరీటి ఈ చిత్రంలో కీలక పత్రాలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్, బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, కృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు.