మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2025 మార్చిలో ప్రారంభం కానుంది. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాను ఎంపిక చేసినట్టు సమాచారం. సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో ఆమెను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఇండొనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయినట్టు చెపుతున్నారు.