ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి రానున్న మోదీ మెచ్చిన మూవీ!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 08, 2025, 04:12 PM

విక్రాంత్ హీరోగా నటించిన సబర్మతి రిపోర్ట్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. గతేడాది విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కాగా ఈ మూవీని ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర బీజేపీ సీనియర్ నాయకులు వీక్షించి ప్రశంసించారు. కొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు కూడా కల్పించారు. అయితే ఈ మూవీ జనవరి 10న జీ5లో స్ట్రీమింగ్ కానున్న చిత్ర యూనిట్ తెలిపింది. విక్రాంత్ ఇందులో జర్నలిస్ట్‌‌గా కనిపించనున్నారు.ది సబర్మతి రిపోర్ట్ గతేడాది నవంబర్ 15న థియేటర్లలో రిలీజైంది. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోయినా.. పొలిటికల్ గా సంచలనం రేపిన మూవీగా నిలిచింది. ఈ సినిమా శుక్రవారం (జనవరి 10) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa