పుష్ప-2' దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బాలనటిగా నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. పద్మావతి మల్లాది దర్శకురాలు. సుకుమార్ అర్ధాంగి తబిత సుకుమార్ సమర్పణలో వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని, శేష సింధురావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ చిత్రానికి అవార్డులు కూడా దక్కాయి. ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం హీరో మహేశ్ బాబు తన ట్విట్టర్‌లో విడుదల చేశారు. ''ట్రైలర్ చూస్తుంటే ప్రామిసింగ్‌గా, హృదయానికి హత్తుకునే విధంగా ఉంది. సుకృతికి, ఈ సినిమా టీమ్ అందరికి నా అభినందనలు'' అంటూ మహేశ్ బాబు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గాంధీ సిద్దాంతాలను అనుసరిస్తూ తమ ఊరిని, తన తాతకు ఇష్టమైన చెట్టును ఓ అమ్మాయి ఎలా కాపాడుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నెల 24న చిత్రం విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa