తమిళ బిగ్ బాస్ 2 కంటెస్టెంట్లు యషిక ఆనంద్.. ఐశ్వర్య దత్తా ఇద్దరూ బిగ్ బాస్ కు ముందు సినిమాలలో నటించారు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ వీరికి భారీ గుర్తింపు తెచ్చిపెట్టింది. యషిక.. ఐశ్వర్య ఇద్దరికి బిగ్ బాస్ లో పాల్గొనకముందు పెద్దగా పరిచయం లేదు. హౌస్ లో ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. బిగ్ బాస్ ముగిసిన తర్వాత కూడా వీరి స్నేహం ఇంకా కొనసాగుతోంది. ఇద్దరూ కలిసి షికార్లు చేస్తూ హోటల్స్ కు.. పార్టీలకు కలిసి వెళ్తూ బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించుకుంటున్నారు. రీసెంట్ గా ఇద్దరూ సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ చాట్ చేశారు. మా ఇద్దరి ఫ్రెండ్ షిప్ కు ఇది ఫస్ట్ యానివర్సరీ అని ఒకరి మీద ఒకరు ప్రేమను అభిమానాన్ని కురిపించుకున్నారు. అయితే ఈ లైవ్ చాట్ ను ముగిస్తూ ‘లవ్ యూ ఆల్’ అని చెప్పే సమయంలో వీరితో పాటుగా ఉన్న మరో బాయ్ ఫ్రెండ్ సడెన్ గా యషిక పెదవులపై గట్టిగా లిప్ లాక్ చేశాడు. సడెన్ గా జరిగినది కావడంతో ఆ లిప్పు లాకు లైవ్ వీడియో చాలామందికి దర్శనమైంది. ఈ సంఘటన ఓ నెల రోజుల క్రితమే జరిగినా వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అయింది.
Yashika Anand boy friend gave liplock viral video | போதையில் யாஷிகா https://t.co/NmJpC4oF6F via @YouTube
— gokulraj natarajan (@gokulrajUAE) July 11, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa