గతంలో రామానంద సాగర్ నేతృత్వంలో వచ్చిన రామాయణం సీరియల్‌ని మించి భారీ బడ్జెట్ తో తనదైన శైలిలో రామాయణాన్ని తెరకెక్కించడానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు దర్శకుడి ఎంపిక కూడా పూర్తి కావాటంతో ఇటీవలే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది.
అయితే ఈ దృశ్య కావ్యంలో ఎవరు నటించబోతున్నారు. రామాయణాన్ని ఏక బిగిన కేవలం మూడు గంటల్లో చూపిస్తారా? లేక సీరియల్ గా ఉంటుందా? ప‌్రతి పాత్రని, ప్రతి అంశాన్ని కనువిందుగా తెరమీదకు తెస్తారా? ఇలా అనేక ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో అల్లూ అరవింద్ ప్రకటన వెలువడిన దగ్గరనుంచీ ఆసక్తి రేగుతునే ఉంది.
దీనికి తోడు ఇప్పుడు రామ పాత్ర దారి కన్నా, సీత పాత్ర ఎవరు చేస్తారనే దానిపై ఊహాగానాలు ఎక్కువైపోయాయి. రామాయణం కథలో సీత పాత్రకు ఉండే ప్రాముఖ్యత తో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. అందునా టాలీవుడ్ నుంచి నయనతార, కాజల్, అనుష్కల పేర్లు ప్రముఖమయ్యాయి. . దీనికి సంబంధించి సామాజిక మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ నటించిన 'శ్రీరామ రాజ్యం' చిత్రంలో నయన్ సీత పాత్రలో నటించి అందరినీ మెప్పించిందని, అరవింద్ రామాయణంలో నూ నయన్ అయితేనే బాగుంటుందని కొందరు చెపుతున్నారు. అయితే, ఇదే సమయంలో అనుష్క పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. మరోవైపు కొత్తదనం కోసం కాజల్‌ని ఎంపిక చేయలని, ఆమెలోని అమాయకత్వం సీత పాత్రని మొప్పించేందుకు బాగుంటుందని పేర్కొంటున్నారు. కొత్తవారిని ఎంపిక చేయాలని ఇంకొందరు సూచిస్తున్నారు. మరి ఈ సీత ఎవరికి దక్కనుందన్నది వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa