తన అందాలతో చెమటలు పట్టించేస్తుంది కాజల్ అగర్వాల్. కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తానంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా.. అప్పుడు ఆయన చేసాడో లేదో తెలియదు కానీ ఇప్పుడు కాజల్ మాత్రం ఇదే చేస్తుంది. తన కంటిచూపుతోనే అందర్నీ మాయ చేయడమే కాదు.. చూపు తిప్పుకోలేని విధంగా తన మాయాజాలంలో పడేస్తుంది. తాజాగా విడుదలైన ఫోటోషూట్లో అమ్మడి చూపులు చూస్తుంటే బాపురే అనుకోకుండా ఉండలేం.కుర్రకారు గుండెలకు గాయాలు చేస్తూ టాలివుడ్ లో దశాబ్దం గడిపేసిన భామ కాజల్ అగర్వాల్. ఈ మధ్య వరుసగా ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో అదరగొడుతోంది. ఆ మధ్య మేకప్ లేకుండా ఫోటోలతో సంచలనం సృష్టించిన ఈ భామ, తాజాగా తెల్లటి గౌన్‌లో అదరగొట్టింది.
అంతగా కసెక్కించే చూపులతో ప్రాణాలు తీస్తుంది కాజల్ అగర్వాల్. తన అందాలను చూపించీ చూపించకుండానే చూపించింది ఈ చందమామ. పైగా నవ్వితే రత్నాలు రాలిపోతాయేమో అనేంత క్యూట్ స్మైల్‌తో పిచ్చెక్కించింది కాజల్. ప్రస్తుతం ఈమె స్టార్ హీరోలతో నటించడం లేదు కానీ స్టార్ హీరోయిన్‌గానే ఉంది. ఈ మధ్యే బెల్లంకొండ శ్రీనివాస్‌తో తేజ తెరకెక్కించిన సీత సినిమాలో నటించింది కాజల్. ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది. అయితే సినిమాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ. దాని వెనక ఉన్న అసలు కారణం ఫోటోషూట్స్ రూపంలో కోట్లకు కోట్లు రావడమే.
#KajalAggarwal angelic looks pic.twitter.com/2nUGUsGGpw
— Ursfalsely (@LuckySh40345494) July 13, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa