చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'తాండల్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్ట్. ఈ సినిమా ఫిబ్రవరి 7, 2025న విడుదల కానుంది. తాజా అప్‌డేట్ ఏమిటంటే, తాండల్ యొక్క అనంతపూర్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సాయి పల్లవి కథనాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. ఈ సినిమాలో ప్రియదర్శి, దివ్య పిళై కీలక పాత్రలలో నటిస్తున్నారు. "తాండేల్" దాని ఆకట్టుకునే కథాంశంతో మరియు దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో భారీ అంచనాలని కలిగి ఉంది. GA2 పిక్చర్స్ క్రింద బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు.