ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘హరి హర వీరమల్లు' నుండి విడుదలైన BTS వీడియో

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 09:39 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్ర పాటల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మాట వినాలి’ అంటూ సాగే మొదటి గీతాన్ని నిర్మాతలు విడుదల చేశారు. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించడం విశేషం. రీసెంట్‌గా విడుదలైన ఈ పాట ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. తాజాగా ఈ పాటకి సంబంధించిన BTS వీడియోని మేకర్స్ విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa