ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మజాకా' సీడెడ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 04:51 PM

తెలుగు నటుడు సందీప్ కిషన్ త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'మజాకా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాకి 30 కోట్లు బడ్జెట్. ఇది నటుడి కెరీర్‌లో సోలో చిత్రానికి అత్యధిక బడ్జెట్‌గా నిలిచింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ భారీ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క సీడెడ్ రైట్స్ ని ధనుష్ ఫిలిమ్స్ సొంతం చేసుకున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సందీప్ కి జోడిగా రీతు వర్మ నటిస్తుంది. ఈ చిత్రంలో అన్షు, మురళి శర్మ, శ్రీనివాస్ రెడ్డి, హైపర్ ఆడి, రాఘు బాబు, అజయ్, చమక్ చంద్ర మరియు ఇతరులు కీలక పాత్రల్లో ఉన్నారు. హాస్య మూవీస్ మరియు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌ల ను ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ అందిస్తున్నారు. రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa