ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందులో ఓ దైవత్వం, అంతులేని ప్రేమ ఉంటుంది

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 07:51 AM

విక్కీ కౌశల్‌, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’. దినేష్‌ విజన్‌ నిర్మాతగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్‌ కాబోతోంది. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రిలీజ్‌ కాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ ప్రస్తుతం ఊపందుకున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ఓ పాటను విడుదల చేశారు.రష్మిక మందన్న మాట్లాడుతూ '‘ఈ చిత్రంలో మాటలకు అందని భావం ఉంటుంది. ఇందులో ఓ దైవత్వం, అంతులేని ప్రేమ ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని చేయాలని ఫిక్స్‌ అయ్యా. ఈ సినిమా చూసిన ప్రతీ సారి ఏడ్చేస్తాను. అంత అద్భుతంగా ఉంటుంది. ఏ ఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌, జానే తూ అనే పాట అందరినీ మెస్మరైజ్‌ చేస్తుంటుంది. విక్కీ చుట్టూ అద్భుతమైన ఆరా ఉంటుంది. ఆయన పక్కన నిలబడితేనే ఓ మ్యాజిక్‌ జరుగుతుంది. 'ఛావా' పాత్రకు విక్కీ అద్భుతంగా సెట్‌ అయ్యారు. అందుకే లక్ష్మణ్‌ విక్కీని ఈ పాత్రకు తీసుకున్నారు’’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa