విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం కనివినీ ఎరుగని వసూళ్లతో ఈ ఏడాది సంక్రాంతి హిట్‌గా నిలిచింది. వెంకటేష్ నటన, బుల్లిరాజు మెరుపులు, పాటలు, అనిల్ రావిపూడి టేకింగ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.మూడో వారం చివరికి చేరుకున్నప్పటికీ.. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి వసూళ్లు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో 20వ రోజు వెంకటేష్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే ..సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. కేవలం మూడు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చిన ఈ సినిమా చూస్తుండగానే రూ.100 కోట్లు, రూ.200 కోట్లను కొట్టేసి రూ.300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటి వరకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రూ. 100 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి చిత్ర యూనిట్‌కు పార్టీ ఇచ్చి.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు. పీకల్లోతు నష్టాల్లో ఉన్న తమను ఈ సినిమా ఒడ్డున పడేసిందని నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు చెబుతున్నారంటే సంక్రాంతికి వస్తున్నాం ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో చెప్పొచ్చు. ఇకపోతే.. 18 రోజుల వరకు నైజాంలో రూ.39.84 కోట్లు, సీడెడ్‌లో రూ.17.61 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.20.97 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.13.24 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.53 కోట్లు, గుంటూరులో రూ.10.05 కోట్లు, కృష్ణాలో రూ.9.23 కోట్లు, నెల్లూరులో రూ. 4.47 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 123.94 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.20 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.200 కోట్లు గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది. మొత్తంగా రూ.150 కోట్ల షేర్‌తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్మురేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa