రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘కాంత’ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 1950ల నాటి మద్రాసు నేపథ్యంలో మానవ సంబంధాలు, సామాజిక, సంక్లిష్టతలను విశ్షేషిస్తూ రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బొర్సే కథనాయిక. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. నటుడిగా దుల్కర్ 13 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ‘కాంత’ చిత్రంలోని ఆయన లుక్‌ని విడుదల చేశారు. ‘దుల్కర్ కెరీర్‌లాగానే ఈ సినిమా కూడా గొప్ప ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది’ అని చిత్ర దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa