ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. సిద్ధార్థ్ తన కాబోయే భార్య నీలం ఉపాధ్యాయతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈరోజు జరిగిన హల్దీ వేడుక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సిద్ధార్థ్ చోప్రా ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో ప్రియాంక పసుపు రంగు దుస్తుల్లో కనిపించింది. వైరల్ అవుతున్న వీడియోలో ప్రియాంక చోప్రా చాలా సరదాగా గడుపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలో ప్రియాంక చోప్రా తన కాబోయే వదిన, ఇతరులతో కలిసి 'ఛాయా ఛాయా', 'మాహి వే' పాటలకు డాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. ప్రియాంక ముందు పెళ్లికూతురు నీలం కూడా తేలిపోయిందని నెటిజన్లు కామెంట్ చేయడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa