యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన మూవీ దిల్‌రూబా. ఈ మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. అయితే చిత్ర యూనిట్ కొత్త రిలీజ్ డేట్‌ను విడుదల చేసింది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను మార్చి 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయినట్లు ప్రకటించారు. ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్‌ను వారు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా విశ్వ కరుణ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో రుక్సర్ ధిల్లోన్ హీరోయిన్‌గా నటించగా సామ్ సి.ఎస్ సంగీతం అందించాడు.కాగా ఇటీవల ‘క’ మూవీతో కిరణ్ మంచి విజయం సాధించాడు.
![]() |
![]() |