తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు హీరో బాలకృష్ణ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. తమన్ ప్రతిభను అభినందిస్తూ పోర్షే కారును కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. 'తమన్ నాకు తమ్ముడితో సమానం. వరుసగా 4 హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు బహుమతిగా ఇచ్చాను. భవిష్యత్తులోనూ మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది' అని అన్నారు.ఇక బాలయ్య అభిమానులు తమన్‌ను నందమూరి తమన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానాన్ని చాటుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో డాకు మమారాజ్ విజయోత్సవ వేడుకల్లో బాలయ్య సైతం తమన్‌కు ఓ పేరు పెట్టారు. నందమూరి తమన్ కాదు.. ఎన్బీకే (నందమూరి బాలకృష్ణ) తమన్ అంటూ పేరు పెట్టారు.
![]() |
![]() |