నందమూరి నట సింహం బాలకృష్ణ ఉగ్రరూపం చూపించిన సినిమా అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ రికార్డ్స్ బద్దలు కొడుతూ భారీ హిట్ సాధించింది. కలెక్షన్స్ పరంగా దూసుకెళ్లి బాక్సాఫీస్ షేక్ చేసింది. దీంతో ఈ సినిమాకు సీక్వల్ వస్తే ఆ లెక్కే వేరుగా ఉంటుందని ఆశపడ్డ నందమూరి అభిమానుల కోసం మరో విజువల్ ట్రీట్ రెడీ చేస్తున్నారు బోయపాటి శ్రీను. అఖండ సీక్వల్ గా అఖండ 2 రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ తాండవం చేయడానికి రెడీ అవుతున్నారు.ఇండస్ట్రీ షేక్ అయ్యే సినిమా రావాలంటే బోయపాటి శ్రీను- బాలకృష్ణ కలవాల్సిందే అన్నట్టుగా ట్రెండ్ క్రియేట్ చేసుకుంది ఈ కాంబో. అంతకుముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు భారీ హిట్స్ సాధించాయి. ఆ తర్వాత అఖండ మూవీతో హ్యాట్రిక్ కొట్టేసింది ఈ సక్సెస్‌ఫుల్ జోడీ. దీంతో అఖండ- 2పై స్పెషల్ ఫోకస్ పెట్టిన బోయపాటి.. ఈ సినిమాలో బాలకృష్ణను రెండు డిఫరెంట్ షేడ్స్ లో చూపించనున్నారు. వాటిలో ఒకటి అఘోరా రోల్. ఈ పాత్ర మొదటి భాగాన్ని మించి ఉండేలా ఆయన ప్లాన్ చేశారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa